SAI Recruitment: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

|

Oct 22, 2021 | 5:49 PM

SAI Recruitment 2021: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థలో..

SAI Recruitment: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Sai Jobs
Follow us on

SAI Recruitment 2021: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారులాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 15 ఖాళీలకు గాను సీనియర్‌ లీడ్‌ (రిసెర్చ్‌) – 04, లీడ్‌ (రిసెర్చ్‌) – 06, స్పోర్ట్స్‌ అసోసియేట్‌ – 05 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* సీనియర్‌ లీడ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/ ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 31-10-2021 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

* లీడ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/ ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏడాది పని అనుభవం ఉండాలి.

* స్పోర్ట్స్‌ అసోసియేట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/ ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం ఆరు నెలల అనుభవం తప్పనిసరి.

ముఖ్యమై విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* సీనియర్‌ లీడ్‌లకు నెలకు రూ. 80,000 నుంచి రూ. 1,45,000 వరకు చెల్లిస్తారు. లీడ్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 45,000 నుంచి రూ. 60,000 వరకు చెల్లిస్తారు. స్పోర్ట్స్‌ అసోసియేట్‌లకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 50,000 చెల్లిస్తారు.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం, విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 08-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 64కు చేరిన మృతుల సంఖ్య

AIIMS Recruitment: పట్నా ఏయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

Ananya Panday: ఎన్సీబీ అధికారుల ముందు అనన్య పాండే.. డ్రగ్స్ వ్యవహారం పై కొనసాగుతున్న విచారణ..