SIDBI Recruitment: లా పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
SIDBI Recruitment: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు..
SIDBI Recruitment: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా లీగల్ అసోసియేట్ కమ్ కౌన్సెల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ రూపంలో పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను recruitment.sidbi@gmail.com మెయిల్ ఐడీకి పంపించాలి.
* అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులు అహ్మదాబాద్, దిల్లీ, లఖ్‌నవూ, ముంబయి కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 19-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..