SIB Bank Jobs 2025: డిగ్రీ అర్హతతో సౌత్‌ ఇండియా బ్యాంకుల్లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్‌

SIB Junior Officer Recruitment 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ సౌత్‌ ఇండియా బ్యాంక్‌ (SIB) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రకటన కింద భర్తీ చేసే పోస్టులకు..

SIB Bank Jobs 2025: డిగ్రీ అర్హతతో సౌత్‌ ఇండియా బ్యాంకుల్లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్‌
South Indian Bank Jobs

Updated on: Oct 19, 2025 | 6:21 AM

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ సౌత్‌ ఇండియా బ్యాంక్‌ (SIB).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ప్రకటన కింద భర్తీ చేసే పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్‌, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ.. రాష్ట్రాల్లో పని చేయవల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

జూనియర్‌ ఆఫీసర్‌ (ఆపరేషన్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50శాతం మార్కులతో ఏదైనా స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. బ్యాంకింగ్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి సెప్టెంబర్‌ 30, 2025వ తేదీ నాటికి 28 ఏళ్ళకు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 22, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదికి రూ.4.86 నుంచి రూ.5.06 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. రాత పరీక్షలు నవంబర్‌ 1, 2 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.