Resume: ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే మీ రెజ్యూమ్‌లో ఈ పాయింట్స్‌ ఉన్నాయా.? ఓసారి చెక్‌ చేసుకోండి..

|

Mar 17, 2021 | 4:26 AM

Resume: ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిలో చాలా మందికి రెజ్యూమ్‌ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఏదైనా కంపెనీకి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళితే ముందుగా రిక్రూటర్‌కు..

Resume: ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే మీ రెజ్యూమ్‌లో ఈ పాయింట్స్‌ ఉన్నాయా.? ఓసారి చెక్‌ చేసుకోండి..
Tips For Resume Making
Follow us on

Resume: ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిలో చాలా మందికి రెజ్యూమ్‌ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఏదైనా కంపెనీకి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళితే ముందుగా రిక్రూటర్‌కు మన రెజ్యూమ్‌ను ఇస్తాం. దీని ఆధారంగానే సదరు రిక్రూటర్‌ మీరు ఏం చదువుకున్నారు, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఏంటి అన్న వివరాలు తెలుసుకుంటారు. అయితే మీ రెజ్యూమ్‌ రూపొందించిన తీరు కూడా మీ ఉద్యోగ అవకాశాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా.? ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని మీ రెజ్యూమ్‌తో ఎలా ఆకట్టుకోవాలి.? ఇందుకోసం మీ రెజ్యూమ్‌ ఎలాంటి అంశాలు ఉండాలి. ఎలాంటివి ఉండకూడదు వంటి వివరాలు ఓసారి తెలుసుకుందాం..

* రిక్రూటర్స్ రెజ్యూమ్‌ను చూడడానినికి ఎక్కువ సమయం కేటాయించరు కాబట్టి.. మీ రెజ్యూమ్‌ రెండు పేజీలకు మించి ఉండకూడదు.

* అనవసర విషయాలను ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం అవసరమైన అంశాలనే పేర్కొనాలి.

* ఇక మీరు ఏ కంపెనీకి దరఖాస్తు చేసుకున్నారో సదరు కంపెనీలో ఉపయోగిస్తున్న టెక్నాలజీకి సంబంధించిన మీకు ఏమైనా అవగాహన ఉంటే దాన్ని హైలెట్‌ చేయాలి.

* మీ విద్యార్హతలను రెజ్యూమ్‌లో కచ్చితంగా పేర్కొనాలి. అంతేకాకుండా మీరు చదువుకునే రోజుల్లో ఏమైనా అచీవ్‌మెంట్స్‌ సాధిస్తే వాటిని కూడా ప్రస్తావించాలి.

* ఇక ఇంతకు ముందు ఉద్యోగం చేసిన వారు ఉంటే.. మీ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి.

* రెజ్యూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ లేకుండా చూసుకోవాలి.

* ఇతరుల రెజ్యూమ్‌ను కాపీ చేయకుండా వీలైనంత వరకు సొంతంగా ప్రీపేర్‌ చేసుకోవడం ఉత్తమం. అలా కానీ నేపథ్యంలో మార్పులు చేర్పులు అయినా చేయాలి.

* రెజ్యూమ్‌లో పేర్కొన్న మీ కాంటాక్ట్‌ వివరాలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ముఖ్యంగా ఫోన్‌ నెంబర్లు పని చేస్తున్నవే ఇవ్వాలి. ఎందుకంటే రిక్రూటర్స్‌ తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి రెజ్యూమ్‌లో ఉండే నెంబర్‌నే ప్రాతిపాదికగా తీసుకుంటారు.

Also Read: JEE Main 2021: నేటినుంచి జేఈఈ మెయిన్ రెండో విడుత పరీక్షలు.. దేశవ్యాప్తంగా 852 కేంద్రాల్లో..

ECIL Recruitment 2021: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ చేసిన వారికి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Warangal Kendriya Vidyalaya: నిరుద్యోగులకు శుభవార్త.. వరంగల్‌ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు