AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూన్‌12న పాఠశాలలు పునఃప్రారంభం కావల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే రోజున నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో బుధవారానికి బదులు..

AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!
AP Schools Reopen Date
Follow us

|

Updated on: Jun 11, 2024 | 7:02 AM

అమరావతి, జూన్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూన్‌12న పాఠశాలలు పునఃప్రారంభం కావల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే రోజున నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో బుధవారానికి బదులు గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అన్ని పాఠశాలల విద్యార్ధులు గమనించాలని విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్‌తో కూడిన విద్యా కానుక కిట్లను అందజేసింది. వరుసగా నాలుగేళ్లపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం మాత్రం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి. కానీ కొత్త సర్కార్‌ కొలువు దీరిన తర్వాత నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది.

పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేసింది. ఈ విద్యా కానుక కిట్‌లలో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలతోపాటు, టోఫెల్‌ వర్క్‌బుక్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్‌ బ్యాగ్, బెల్ట్, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు ఉంటుంది. ఇవి కాకుండా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్‌ డిక్షనరీ అందిస్తారు. 6 నుంచి 10 తరగతులకు అయితే నోట్‌బుక్స్‌ ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం కూడా గతంలో ఇచ్చినట్టుగానే ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేస్తున్నారు. అలాగే, 3 నుంచి 10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈలోకి మారిన సంగతి తెలిసిందే.

పదో తరగతి సాంఘికశాస్త్రం పుస్తకాలను సీబీఎస్‌ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్‌ సైన్స్‌ పుస్తకాలను ఆర్ట్‌ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
టెలికాం కంపెనీల వద్ద 254 కోట్ల మొబైల్ నంబర్లు: ట్రాయ్‌ నివేదిక
టెలికాం కంపెనీల వద్ద 254 కోట్ల మొబైల్ నంబర్లు: ట్రాయ్‌ నివేదిక
సూపర్ 8కు ముందు టీమిండియాకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
సూపర్ 8కు ముందు టీమిండియాకు ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
కబోర్డ్‏లో పెట్టిన బర్గర్.. 5 ఏళ్ల తర్వాత చూసి షాక్..
కబోర్డ్‏లో పెట్టిన బర్గర్.. 5 ఏళ్ల తర్వాత చూసి షాక్..
పండ్లు, కూరగాయలతో వెళ్తున్న 10 కంటైనర్లు.. అనుమానంతో తెరచి చూడగా
పండ్లు, కూరగాయలతో వెళ్తున్న 10 కంటైనర్లు.. అనుమానంతో తెరచి చూడగా
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
టీ20 మాన్‌స్టర్‌రా.. ఈ ప్లేయర్! ఒక్క ఓవర్‌లో 36 పరుగులు..
టీ20 మాన్‌స్టర్‌రా.. ఈ ప్లేయర్! ఒక్క ఓవర్‌లో 36 పరుగులు..
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఏయే రంగాల వారు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఏయే రంగాల వారు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు
విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరించిన డైరెక్టర్.. కారణమేంటో తెలుసా?
విజయ్ సేతుపతి పాదాలకు నమస్కరించిన డైరెక్టర్.. కారణమేంటో తెలుసా?
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?