SBI Recruitment 2021: నిరుద్యోగులు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 3

|

May 02, 2021 | 3:29 PM

SBI Recruitment 2021: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇప్పటికే ఎస్‌బీఐలో చాలా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు

SBI Recruitment 2021: నిరుద్యోగులు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 3
Follow us on

SBI Recruitment 2021: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇప్పటికే ఎస్‌బీఐలో చాలా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక విడుదలైన మరో నోటిఫికేషన్‌లో భర్తీ చేసే ఉద్యోగాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ. ఎస్‌బీఐలో పలు ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఫార్మసిస్టు విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. తాజాగా బ్యాంకు నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి ఫార్మసీలోడిప్లొమా చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడీ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును రూ.750గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మే 3 చివరి తేదీ విధించింది.

ఇవీ కూడా చదవండి:

DFCCIL Recruitment 2021: రైల్వే శాఖకు చెందిన డిడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలు విడుదల.. జూన్‌ 20న ఫలితాలు