SBI Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే స్పెషల్ కేడర్ ఆఫీసర్ -SCO పోస్టుల భర్తీకి దరఖాస్తు విండోను మళ్లీ ఓపెన్ చేసింది. ఫైర్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 15 నుంచే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 28వ చివరి తేదీ. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 28లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.750.
ఇక విద్యార్హతల విషయానికొస్తే.. బీఈ (ఫైర్) పాస్ కావాలి. లేదా నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ నుంచి బీటెక్ లేదా బీఈ పాస్ కావాల్సి ఉంటుంది. ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో బీటెక్ లేదా బీఈ పాస్ కావాలి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్‌ను చూడాలి.
ఈ పోస్టులకు https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసిన తర్వాత Latest Announcments లో ఫైర్ మేనేజర్ జాబ్ నోటీస్‌లో Apply Online క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక అందులో Click for New Registration పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఇతర వివరాలు నమోదు చేసి మొదట రిజిస్టర్ చేయాలి. తర్వాత రెండో స్టెప్‌లో ఇతర వివరాలు, మూడో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. నాలుగో స్టెప్‌లో వివరాలన్నీ సరిచూసుకొని చివరి స్టెప్‌లో పేమెంట్ చేయాలి. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.