SBI PO Admit Card 2025: మరో వారంలో ఎస్‌బీఐ పీఓ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 ప్రిలిమినరీ పరీక్ష సమీపిస్తుంది. మరో వారం రోజుల్లోనే ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి..

SBI PO Admit Card 2025: మరో వారంలో ఎస్‌బీఐ పీఓ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
SBI Bank PO Exam

Updated on: Jul 26, 2025 | 4:19 PM

హైదరాబాద్‌, జులై 26: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2025 ప్రిలిమినరీ పరీక్ష సమీపిస్తుంది. మరో వారం రోజుల్లోనే ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 2, 4, 5 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా మొత్తం 541 ప్రొబేషనరీ ఆఫీసర్‌ నియమకాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

ఎస్‌బీఐ పీఓ అడ్మిట్‌ 2025 కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ ఆయుష్‌ విభాగంలో 358 ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్‌ సేవలను అందించడానికి కూటమి సర్కార్‌ అనుమతించింది. ఈమేరకు సేవల విస్తరణకు చర్యలు చేపట్టింది. ఈ విభాగంలో వైద్యులతోపాటు వివిధ కేటగిరీల్లో 358 మందిని నియమించనున్నట్లు తెలిపింది. మొత్తం పోస్టుల్లో 71 మంది వైద్యులు, ముగ్గురు మానసిక వైద్యులు, 26 మంది జిల్లా ప్రోగ్రాం మేనేజర్లు, 90 మంది పంచకర్మ (ఇది ఆయుర్వేద వైద్య విధానంలో ఒక శుద్ధి చేసే చికిత్స)థెరపిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, సహాయకుల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తాజాగా ఆమోదం తెలిపారు. ఒప్పంద, పొరుగు సేవల పద్ధతిలో ఈ పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.