SBI PO Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌! స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1673 పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు..

|

Oct 20, 2022 | 8:49 AM

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ముంబాయి ప్రధాన కేంద్రంగా పనిచేసే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో.. 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల (Probationary Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

SBI PO Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌! స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1673 పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు..
SBI PO Recruitment 2022
Follow us on

SBI Probationary Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ముంబాయి ప్రధాన కేంద్రంగా పనిచేసే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఎస్బీఐ బ్రాంచుల్లో.. 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల (Probationary Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిల్లో రెగ్యులర్ పోస్టులు 1600 ఉండగా, బ్యాక్‌లాగ్ పోస్టులు 73 వరకు ఉన్నాయి. కేటగిరీ వారీగా చూస్తే..ఎస్సీ- 270, ఎస్టీ- 131, ఓబీసీ- 464, ఈడబ్ల్యూఎస్‌- 160, యూఆర్‌- 648 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి ఏప్రిల్‌ 1, 2022వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత (ప్రిలిమినరీ/మెయిన్స్‌) పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఫేజ్‌-I, ఫేజ్‌-II, ఫేజ్‌-III రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్‌ ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.41,960లు జీతంగా చెల్లిస్తారు.

ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు, 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో గంట సమయంలో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

మెయిన్‌ రాత పరీక్ష విధానం: మొత్తం 155 ఆబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నలకు 200 మార్కులకుగానూ 3 గంటల సమయంలో పరీక్ష ఉంటుంది. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలకు 50 మార్కులు, డాటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో 30 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 35 ప్రశ్నలకు 40 మార్కుల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డిస్క్రిప్టిప్‌ పేపర్: రెండు ఎస్సేలకు 25 మార్కుల చొప్పున 50 మార్కులకు 30 నిముషాల్లో పరీక్ష ఉంటుంది. గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటుంది.

ఖాళీల వివరాలు ఇవే..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీ: అక్టోబర్‌ 12, 2022.
  • అప్లికేషన్‌ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: అక్టోబర్‌ 12, 2022.
  • ప్రిలిమినరీ పరీక్షలకు అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్: డిసెంబర్ మొదటి/ రెండో వారం, 2022.
  • ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: డిసెంబర్ 17, 18, 19, 20.
  • ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: డిసెంబర్ 2022/జనవరి 2023.
  • మెయిన్స్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్: జనవరి/ఫిబ్రవరి 2023.
  • మెయిన్స్‌ పరీక్ష తేదీలు: జనవరి/ఫిబ్రవరి 2023.
  • మెయిన్స్‌ పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: ఫిబ్రవరి 2023.
  • సైకోమెట్రిక్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి 2023.
  • సైకోమెట్రిక్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి/మార్చి 2023.
  • ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: ఫిబ్రవరి/మార్చి 2023.
  • ఫైనల్‌ రిజల్ట్స్‌ ప్రకటన తేదీ: మార్చి 2023.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.