SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలకు త్వరలో పరీక్ష… ఎగ్జామ్‌ విధానం ఎలా ఉంటుంది..?

SBI Clerk Jobs 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పలు ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనుంది...

SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలకు త్వరలో పరీక్ష... ఎగ్జామ్‌ విధానం ఎలా ఉంటుంది..?

Updated on: Jun 07, 2021 | 7:17 PM

SBI Clerk Jobs 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పలు ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌ల్లో ఈ ఖాళీలు భర్తీ కానున్నాయి. డిగ్రీ పాసైన వారు, డిగ్రీ చివరి సంవత్సరంలో చదువుతున్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది ఎస్‌బీఐ. ఈ పోస్టులకు లక్షల్లో దరఖాస్తు వచ్చాయి. ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక చేయనుంది. ప్రిలిమ్స్ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో 100 ఆబ్జెక్టీవ్ ప్రశ్నలుంటాయి. 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు మాత్రమే. 3 సెక్షన్లకు సంబంధించి 20 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది.

ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు. ప్రతీ సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. తప్పుగా రాసిన ప్రతీ సమాధానానికి 0.25 మార్కుల్ని తగ్గిస్తారు. అయితే ఉన్న పోస్టుల కంటే 10 రెట్లు అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ఇక ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మెయిన్స్‌లో 190 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు. అలాగే జనరల్, ఫైనాన్స్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ మినహా అన్ని ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. 1/4 నెగిటీవ్ మార్క్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారిన ఫైనల్ సెలక్షన్‌కు ఎంపిక చేస్తారు. వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటాయి.

ఇవీ కూడా చదవండి:

NLCIL Recruitment: నేషనల్‌ లిగ్నైట్‌ అండ్‌ కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ప్రాక్టిక‌ల్ టెస్ట్ ద్వారా ఎంపిక‌..

konkan Railway: కొంక‌ణ్ రైల్వేలో ఉద్యోగాలు… గ‌రిష్టంగా రూ. 90 వేల‌కుపైగా వేత‌నం.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..