SBI Clerk: మీరు ఎస్‌బీఐ క్లర్క్‌ పరీక్షకు హాజరయ్యారా.. ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందో తెలుసా.?

|

Sep 03, 2021 | 11:51 AM

SBI Clerk: భారతీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ ఇటీవల ఎస్‌బీఐ క్లర్క్‌ 2021 పరీక్షను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలోని పలు...

SBI Clerk: మీరు ఎస్‌బీఐ క్లర్క్‌ పరీక్షకు హాజరయ్యారా.. ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందో తెలుసా.?
Sbi Clerk
Follow us on

SBI Clerk: భారతీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ ఇటీవల ఎస్‌బీఐ క్లర్క్‌ 2021 పరీక్షను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్ష ఆగస్టు 29, 2021తో ముగిసింది. ఇదివదరకు క్లర్క్‌ ప్రిలీమ్స్‌ ఎగ్జామ్‌ 2021ని జూలై 10 నుంచి జూలై 13 వరకు నిర్వహించారు. ఇదిలా ఉంటే పరీక్ష ఫలితాలను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ sbi.co.inని గమనిస్తూ ఉండండని ఎస్‌బీఐ తెలిపింది. ఇక ఎస్‌బీఐ ఈ పరీక్ష ద్వారా 4915 ఖాళీలను భర్తీ చేయనుంది.

కటాఫ్‌ మార్కులు ఇలా ఉండొచ్చు..

ఇదిలా ఉంటే ఈ పరీక్షలో ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్‌ క్యాటగిరీ వారికి 65-75, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60-70, ఓబీసీ వారికి 60-65, ఎస్‌సీ అభ్యర్థులకు 40-50, ఎస్టీ అభ్యర్థులకు 35-45 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి.

ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

ఫలితాలు విడుదలైన తర్వాత కింది స్టెప్స్‌ ఫాలో అయ్యి చెక్‌ చేసుకోవచ్చు.
* ముందుగా అభ్యర్థులు.. sbi.co.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్‌ పేజీలో ఉన్న ‘కెరీర్స్‌’ అనే ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
* తర్వాత ‘ఎస్‌బీఐ ప్రిలీమ్స్‌ రిజల్ట్స్ 2021’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
* దీంతో ఎస్‌బీఐ క్లర్క్‌ పీడీఎఫ్‌ ఫైల్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది.

Also Read: NHPC Recruitment 2021: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే..

Amazon Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా ఉద్యోగ నియామకాలు.. కీలక ప్రకటన చేసిన అమెజాన్‌

SBI Recruitment 2021: నిరుద్యోగులు అలర్ట్..! ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ రోజే చివరితేదీ..