SAMEER Recruitment 2022: నెలకు రూ.30,000లజీతంతో సమీర్‌లో రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER), కోల్‌కతా సెంటర్ నిర్ణీత కాల ఒప్పంద..
SAMEER Research Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER), కోల్‌కతా సెంటర్ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ (Research Scientist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.15,100ల నుంచి రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు: 6 విభాగాలు: ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/టెలీకమ్యూనికేషన్ అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: 2 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/టెలీకమ్యూనికేషన్ అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులు: 5 అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ: hrd@mmw.sameer.gov.in
అడ్రస్: HEAD ACCOUNTS &ADMINISTRATION SOCIETY FOR APPLIED MICROWAVE ELECTRONICS ENGINEERING AND RESEARCH PLOT – L2, BLOCK – GP, SECTOR – V, SALT LAKE ELECTRONICS COMPLEX KOLKATA – 700091.
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2022.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: