SAI Recruitment: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Apr 10, 2022 | 7:40 AM

SAI Recruitment 2022: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఈ సంస్థ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది...

SAI Recruitment: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Sai Jobs
Follow us on

SAI Recruitment 2022: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఈ సంస్థ మెడికల్ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఉద్యోగాలను ఎలా భర్తీ చేయనున్నారన్న పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 మెడికల్‌ ఆఫీసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 27-04-2022 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000 వేతనంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 27-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: పేటీఎం సరికొత్త సేవలు.. ఇప్పుడే బుక్‌ చేయండి.. డబ్బులు తర్వాత చెల్లించండి

Discount For Electric Cycle: ఎలక్ట్రిక్ సైకిళ్ల కొనుగోలుదారులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ఎంత డిస్కౌంట్ ప్రకటించిందంటే..

DC VS KKR Playing XI IPL 2022: ఢీ అంటే ఢీ.. శ్రేయాస్‌ వర్సెస్ రిషబ్ పోరులో గెలిచేదెవరో.. ప్లేయింగ్ XI ఉందంటే?