భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ.. 10 అసిస్టెంట్ ఎడిటర్, సేల్స్-కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, సబ్ ఎడిటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యాలు అవసరం. అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు (డిసెంబర్ 1, 2022) కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులందరూ తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: Secretary, Sahitya Akademi, Rabindra Bhavan, 35 Ferozeshah Road, New Delhi-110001.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.