RRC Railway Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. పదో తరగతి అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. 

RRC South Central Railway Sports Quota Recruitment 2025 Notification: 2025-26 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వే ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..

RRC Railway Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. పదో తరగతి అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. 
RRC South Central Railway Sports Quota Jobs

Updated on: Nov 10, 2025 | 3:58 PM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ రైల్వే రీజియన్లలో 2025-26 సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వే ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ కోటా కింద మొత్తం 61 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నవంబర్ 24, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇలా..

  • ఎస్‌సీఆర్‌, హెడ్‌ క్వార్టర్స్‌, సికింద్రాబాద్‌ కోటాలో పోస్టుల సంఖ్య: 21
  • లెవెల్‌ 1 (హెడ్‌ క్వార్టర్స్‌ కోటా)లో పోస్టుల సంఖ్య: 10
  • సికింద్రాబాద్‌ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
  • హైదరాబాద్‌ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
  • విజయవాడ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
  • గుంటూరు డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
  • గుంతకల్‌ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5
  • నాందేడ్‌ డివిజన్‌లో పోస్టుల సంఖ్య: 5

ఆసక్తి కలిగిన వారు పదో తరగతి లేదా ఐటీఐ, ఇంటర్మీడియట్‌ విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే అథ్లెటిక్స్, షెటిల్‌ బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్‌, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఖోఖో, పవర్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్, వెయిట్‌ లిఫ్టింగ్‌, హాకీ వంటి తదితర క్రీడల్లో ఏదైనా ఒక దాంట్లో దేశం, రాష్ట్రం, విశ్వవిద్యాలయం, పాఠశాల స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొని ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 24, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మైనారిటీ/ ఓబీసీ అభ్యర్ధులు రూ.250 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్‌ ట్రయల్స్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.