కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా?.. పదో తరగతి అర్హతతో RRB రైల్వేలో 6,565 ఉద్యోగాలు

RRB Technicain 2026 Notification: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి జూన్ 30న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా?.. పదో తరగతి అర్హతతో RRB రైల్వేలో 6,565 ఉద్యోగాలు
RRB Technician Recruitment

Updated on: Jun 19, 2026 | 6:44 AM

రైల్వే శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. జూన్‌ 30వ తేదీన ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ విడుదలకానుంది. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 30 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,565 టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో టెక్నీషియన్‌ గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులు 323, గ్రేడ్‌ 3 పోస్టులు 6,565 వరకు ఉన్నాయి. పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన వారు జులై 29, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్‌ గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు నెలకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు రూ.19,900 నుంచి బేసిక్‌ జీతం మొదలవుతుంది. ఈ పోస్టులన్నింటినీ హ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్లలో భర్తీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

అయితే రీజియన్ల వారీ ఖాళీల వివరాలు, విద్యార్హతలు, రాత పరీక్ష, సిలబస్‌, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు వంటి ఇతర పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్న పూర్తి నోటిఫికేషన్‌ తెలుసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us