
హైదరాబాద్, మార్చి 1: కేంద్ర రైల్వే శాఖ ఆధ్వర్యంలోని వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి సంబంధించి మరో 5 రోజుల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన సిటి ఇంటిమేషన్ స్లిప్పులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు అభ్యర్ధులు ముందుగా తమ పరీక్ష నగరం వివరాలు తెలుసుకునేందుకు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అభ్యర్ధులు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్ష అడ్మిట్ కార్డులు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. అంటే పరీక్ష తేదీకి సరిగ్గా నాలుగు రోజుల ముందు అభ్యర్ధుల అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో మార్చి 6వ తేదీన పరీక్ష రాసే అభ్యర్ధులకు మార్చి 3వ తేదీన అడ్బిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.
ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్ సీటీ ఇంటిమేషన్ స్లిప్పుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్ ఆన్‌లైన్ రాత పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఇటీవలే పరీక్షల రివైజ్‌డ్ ఎగ్జామ్స్ తేదీలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. గతంలో (జనవరిలో) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ తేదీలను తాజాగా ఆర్‌ఆర్‌బీ మార్చింది. దీంతోఒక రోజు తర్వాత నుంచి పరీక్షలు మొదలవనున్నాయి. ఇక రైల్వేలో వివిధ విభాగాల్లో మొత్తం 6,238 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, తదితర విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, మెడికల్ పరీక్షలు, సర్టిపికెట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది. ఇతరవ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.