RRB, SECR Recruitment 2021: రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు శుభవార్త. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) వందలాది పోస్టుల భర్తీ చేపట్టేందుకు ప్రక్రియను ప్రారంభించింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 339 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తోంది. 10వ తరగతి చదివిన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం అనే చెప్పాలి. ఈ పోస్టుల భర్తీ కోసం అన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 5 గా నిర్ణయించారు. ఈ నియామకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
1. వెల్డర్
2. కార్పెంటర్
3. ఫిట్టర్
4. ఎలక్ట్రీషియన్
5. స్టెనో
6. వైర్‌మాన్
7. ఎలక్ట్రానిక్ మెకానిక్
8. మెకానిక్ డీజిల్
అర్హత..
10వ తరగతి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ITI కలిగి ఉండాలి.
వయో పరిమితి..
అభ్యర్థుల వయస్సు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ఇలా ఉంటుందంటే..
10వ తరగతి, ఐటిఐలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక కోసం రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగానే సెలక్ట్ చేస్తారు.
ఇలా అప్లై చేయండి..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ అయిన apprenticeship.org ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also read:
Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!
Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు..
Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. ఇదిగో ఇలా స్కిడ్ అయ్యింది.. వీడియో ఫుటేజీ..