RRB Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే టీచర్‌ ఉద్యోగాలు.. మరో వారంలోనే రాత పరీక్షలు షురూ!

RRB Ministerial and Isolated Categories Exam City Intimation Slip 2025: వివిధ రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల..

RRB Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే టీచర్‌ ఉద్యోగాలు.. మరో వారంలోనే రాత పరీక్షలు షురూ!
RRB Railway Teacher Jobs

Updated on: Sep 03, 2025 | 4:21 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదలకానున్నాయి. కాగా సెప్టెంబర్‌ 10 నుంచి 12 వరకు మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1036 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష అనంతరం టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ టీచర్‌ పోస్టులకు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలకు తుది గడువు పెంపు..

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ).. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఇప్పటికే ప్రారంభమవగా.. సెప్టెంబర్‌ 1వ తేదీతో తుది గడువు ముగిసింది. అయితే అభ్యర్ధుల విజ్ఞప్తుల మేరకు సెప్టెంబర్‌ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువుపు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలని తన ప్రకటనలో బోర్డు సూచించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.