RRB Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

|

Mar 25, 2025 | 8:30 AM

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పలు రైల్వే పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ పరీక్షల ఎగ్జాం సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు పరీక్షకు పది రోజుల ముందు విడుదల చేస్తారు. ఇక అడ్మిట్‌ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువస్తారు..

RRB Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
RRB Exam Dates
Follow us on

హైదరాబాద్‌, మార్చి 25: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పలు పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం పారా-మెడికల్ పరీక్ష (సీబీటీ) ఏప్రిల్‌ 28 నుంచి 30 వరకు జరగనున్నాయి. మొత్తం 3 రోజుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జాం సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లు పరీక్షకు పది రోజుల ముందు విడుదల చేస్తారు. ఇక అడ్మిట్‌ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువస్తారు.

కాగా భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు… దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నంబర్‌ 04/2024 నోటిఫికేషన్‌ను గత ఏడాది జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో మొత్తం 1376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

ఆర్‌ఆర్‌బీ పారా-మెడికల్‌ పరీక్షల షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆర్‌ఫీఎఫ్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక కీ విడుదల.. మార్చి 29 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఆర్‌ఆర్‌బీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) పరీక్షల ప్రాథమిక కీలను తాజాగా వెల్లడించింది. మార్చి 24వ తేదీ నుంచి 29 వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉంటుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్ కీ పై అభ్యంతరాలను తెలిపేందుకు మార్చి 29 సాయంత్రం 6 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. కాగా మార్చి 2 నుంచి 18 వరకు ఆపీఎఫ్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి ఆన్సర్‌ కీ పై అభ్యంతరాలను తెలపవచ్చు. వీరి ఆన్సర్లు సరైనవని తేలీతే తిరిగి రీఫండ్‌ చేస్తారని రైల్వే శాఖ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 4208 ఆర్‌ఫీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.