RRB NTPC Railway Jobs 2025: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో 8,875 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. 2025 సంవత్సరానికి సంబంధించి భారీగా రైల్వే ఉద్యోగాలకు తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,875 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది..

RRB NTPC Railway Jobs 2025: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో 8,875 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!
RRB NTPC Recruitment Notification

Updated on: Sep 25, 2025 | 11:23 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 సంవత్సరానికి సంబంధించి భారీగా రైల్వే ఉద్యోగాలకు తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,875 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక సెంట్రలైజ్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ (CEN 2025) త్వరలో విడుదల చేయనుంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయడానికి ఆమోదించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. మొత్తం పోస్టుల్లో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్‌, 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌లో ఉన్నాయి.

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్‌లోని గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా గూడ్స్ రైలు మేనేజర్ పోస్టులు 3,423 వరకు ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ పోస్టులు 921, స్టేషన్ మాస్టర్ పోస్టులు 615, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 638, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు 161, మెట్రో రైల్వేలో ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు 59 వరకు ఉన్నాయి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో అత్యధికంగా కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ పోస్టులు 2,424 వరకు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 394, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ పోస్టులు 163, రైళ్ల క్లర్క్ పోస్టులు 77 వరకు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హతలు, జోన్ల వారీగా ఖాళీలు, ఎంపిక విధానం, వయోపరిమితి, సిలబస్‌ వంటి తదితర పూర్తి వివరాలతో కూడిని వివరణాత్మక నోటిఫికేషన్‌ను త్వరలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేయనుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.