Railway Jobs 2025: రైల్వేలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మరో 4 రోజుల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

RRB NTPC Graduate and Under Graduate Jobs 2025: రైల్వేలో నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ కింద గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం..

Railway Jobs 2025: రైల్వేలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మరో 4 రోజుల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
RRB NTPC Graduate and Under Graduate Jobs

Updated on: Oct 17, 2025 | 6:21 PM

హైదరాబాద్, అక్టోబర్ 17: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నాన్టెక్నికల్పాపులర్‌ కేటగిరీస్‌ కింద గ్రాడ్యుయేట్, అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్కింద మొత్తం 8,050 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో గ్రాడ్యుయేట్ పోస్టులు 5 వేలు, అండర్ గ్రాడ్యుయేట్పోస్టులు 3,050 వరకు ఉన్నాయి. అయితే పోస్టులకు ఆన్‌లైన్దరఖాస్తులు మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. తొలుత గ్రాడ్యుయేట్పోస్టులకు అక్టోబర్‌ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక అండర్గ్రాడ్యుయేట్పోస్టులకు అక్టోబర్‌ 28 నుంచి దరఖాస్తులు ప్రారంభం అవుతాయి.

గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, అండర్ గ్రాడ్యుయేట్స్థాయిలో కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, రైళ్ల క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈపోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక అండర్గ్రాడ్యుయేట్పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

వయసు.. అండర్గ్రాడ్యుయేట్పోస్టులకు 18 నుంచి 38 ఏళ్లు, గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 16 నుంచి 33 ఏళ్ల వరకు ఉండాలి. రిజర్వేషన్వర్గాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. గ్రాడ్యుయేట్పోస్టులకు నవంబర్20, 2025, అండర్గ్రాడ్యుయేట్పోస్టులకు నవంబర్‌ 27, 2025 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్త్వరలోనే విడుదల కానుంది. ఇతర వివరాలు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లో చెక్చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్కోసం ఇక్కడ క్లిక్చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్చేయండి.