RRB Railway Exam 2025: ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ రాత పరీక్ష మీరు రాశారా? అక్టోబర్‌ 8 వరకు ఛాన్స్‌..

ఇటీవల నిర్వహించిన మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ రాత పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతోపాటు క్వశ్చన్ పేపర్‌, రెస్పాన్స్‌ షీట్లను కూడా..

RRB Railway Exam 2025: ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ రాత పరీక్ష మీరు రాశారా? అక్టోబర్‌ 8 వరకు ఛాన్స్‌..
RRB Ministerial and Isolated Categories Answer Key

Updated on: Oct 06, 2025 | 7:17 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6: ఆర్‌ఆర్‌బీ ఇటీవల నిర్వహించిన మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ రాత పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతోపాటు క్వశ్చన్ పేపర్‌, రెస్పాన్స్‌ షీట్లను కూడా అభ్యర్ధి లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్‌ కీ పై అభ్యంతరాలను అక్టోబర్‌ 8 వరకు ఆన్‌లైన్‌ ద్వారా తెలపడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది ఆన్సర్‌ కీ రూపొందించి, ఫలితాలు వెల్లడిస్తుంది.

కాగా ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ రాత పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 10 నుంచి 12 వరకు జరిగాయి. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1036 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు.

ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పీజీ మెడికల్‌ యాజమాన్య కోటాకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలోని పీజీ వైద్య విద్యలో యాజమాన్య కోటా కింద ప్రవేశాలు కల్పించడానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రైవేటు, మైనారిటీయేతర, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో ఎంక్యూ-1, ఎంక్యూ-2, ఎంక్యూ-3 విభాగాల్లో ప్రవేశాల కోసం అక్టోబరు 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని యూనివర్సిటీ తన ప్రకటనలో వెల్లడించింది. వెబ్‌ ఆప్షన్ల కోసం త్వరలో తేదీలను ప్రకటించనున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.