RRB JE Jobs 2025: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలు భారీగా పెరిగాయ్‌! మొత్తం ఎన్నంటే..

RRB JE 2025 Vacancies revised: ఆర్‌ఆర్‌బీ ఇటీవల 2,569 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమైనాయి. ఈ క్రమంలో..

RRB JE Jobs 2025: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలు భారీగా పెరిగాయ్‌! మొత్తం ఎన్నంటే..
RRB Junior Engineer Jobs

Updated on: Nov 16, 2025 | 6:42 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 16: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)ఇటీవల 2,569 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమైనాయి. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌బీ మరో కీలక ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటనలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో మార్పులు చేసింది. అలాగే దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసింది.

జూనియర్‌ ఇంజినీర్‌, డిపొ మెటీరియల్‌ సూపరిటెండెంట్‌, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించిన ఖాళీలలో జమ్మూ-శ్రీనగర్‌, చెన్నై రిజియన్ల పరిధిలోని ఖాళీలను ఆర్‌ఆర్‌బీ పెంచినట్లు తన ప్రకటనలో తెలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 2,588కి చేరింది. మరోవైపు దరఖాస్తు చివరి తేదీని కూడా మరో 10రోజులు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు ఎంచుకున్న ఆర్ఆర్‌బీ, పోస్టు ప్రాధాన్యత, రైల్వే జోన్‌/ప్రొడక్షన్‌ యూనిట్‌ ప్రాధాన్యతలను ఎటువంటి రుసుము చెల్లించకుండా సవరించుకోవచ్చు. ఈ సదుపాయం నవంబర్‌ 25 నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తు చివరి తేదీ వరకు సవరణకు అవకాశం కల్పించనుంది.

అక్టోబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2,569 ఖాళీలున్నాయి. దానిలో చెన్నై రీజియన్‌లో 160 ఉండగా 169కు, జమ్మూ-శ్రీనగర్‌ రీజియన్‌లో 88కు బదులు 95 ఖాళీలను పెంచింది. నవంబర్‌ 30తో దరఖాస్తు ముగియనుండగా దానిని డిసెంబర్‌ 10 వరకు పొడిగించింది. డిసెంబర్ 10, 2025వ తేదీ రాత్రి 23.59 గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు పేర్కొంది. ఇక డిసెంబర్‌ 13 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణకు అవకాశం కల్పిస్తారు. రాత పరీక్ష తేదీలు త్వరలోనే ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి

ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.