RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చేస్తుందోచ్‌!

RRB Isolated Category Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో తీపికబురు చెప్పింది. ఐసోలేటెడ్ కేటగిరీస్‌ విభాగంలో త్వరలో 311 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ వివరాల ప్రకారం డిసెంబర్ 30 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..

RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చేస్తుందోచ్‌!
RRB Isolated Category Jobs

Updated on: Dec 18, 2025 | 6:41 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో తీపికబురు చెప్పింది. ఐసోలేటెడ్ కేటగిరీస్‌ విభాగంలో త్వరలో 311 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ వివరాల ప్రకారం డిసెంబర్ 30 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 29, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఉండవల్సిన అర్హతల పూర్తి వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. 19,900 నుంచి రూ. 44,900 వరకు వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రైల్వే బోర్డు వివిధ రైల్వే రిజియన్లలో సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3, చీఫ్ లా అసిస్టెంట్‌, జూనియర్ ట్రాన్స్‌లేటర్, స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్షలు (2 దశలు), ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఖాళీల వివరాలు ఇవే..

  • సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 15
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుల సంఖ్య: 39
  • చీఫ్ లా అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 22
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల సంఖ్య: 202
  • స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 24
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య: 7
  • సైంటిఫిక్ సూపర్‌వైజర్ పోస్టుల సంఖ్య: 2

ఇతర పూర్తి వివరాలకు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.