
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన హర్యాణాలోని గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES).. 30 ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. 32 ఏళ్లకు మించకుండా వయసుండాలి.
ఆసక్తిబకలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 25, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.300లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.