Agriculture Admissions: బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు.. కారణం ఇదే

|

Nov 26, 2024 | 6:18 AM

ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి నేడు జరగనున్న కౌన్సెలింగ్ ప్రక్రియ కొన్ని కారణాల రిత్యా వాయిదా పడింది. ఈ మేరకు తెలియజేస్తూ వర్సిటీ అధికారులు..

Agriculture Admissions: బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు.. కారణం ఇదే
RG Ranga Admissions
Follow us on

గుంటూరు, నవంబర్‌ 26: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మిగిలిన సీట్ల భర్తీకి నవంబరు 26వ తేదీన కౌన్సెలింగ్‌ జరగనుంది. అయితే ఈ కౌన్సెలింగ్‌ని రద్దు చేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి రామచంద్రరావు నవంబరు 25న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విద్యార్ధులు మార్పును గమనించాలని సూచించారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఆర్‌పీఎఫ్‌ ఎస్సై ఎగ్జామ్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌.. త్వరలోనే హాల్‌టికెట్లు

రైల్వే ఉద్యోగాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) కీలక అప్‌డేట్ జారీ చేసింది. త్వరలో జరగనున్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF)లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల నియామక రాత పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, యూజర్‌ పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులో పరీక్ష కేంద్రం, సిటీ, పరీక్ష తేదీ, సమయం, మార్గదర్శకాలు వంటి తదితర సమాచారం మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి.

కాగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో 452 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి గత మేలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 2, 3, 9, 12, 13 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఆర్‌పీఎఫ్‌ ఎస్సై ఎగ్జామ్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.