RRU Recruitment: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

|

Nov 23, 2021 | 11:03 AM

RRU Recruitment 2021: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేశారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఉన్న ఈ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులను...

RRU Recruitment: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Rru Recruitment
Follow us on

RRU Recruitment 2021: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేశారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఉన్న ఈ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (బుధవారం) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డైరెక్టర్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (01), ప్రొఫెసర్‌ (లా /క్రిమినాలజీ/సెక్యూరిటీ స్టడీస్‌) (02), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(లా/క్రిమినాలజీ /సెక్యూరిటీ స్టడీస్‌) (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు దరఖాస్తులను ది అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, హ్యూమన్‌ రిసోర్స్‌ సెక్షన్, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఏటి.లావడ్, టీఏ.డెహగమ్, గాంధీనగర్‌ పీఓ–382305 అడ్రస్‌కు పంపించాలి.

* ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.21,700 నుంచి రూ.1,82,200 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు, ఆ తర్వాత ఇంటరవ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ రేపటితో (24-11-2021)తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Winter Makeup Tips: కాలం మారింది.. మేకప్ కిట్‌లో ఈ నాలుగు మార్పులు చేసుకోండి..

Heavy Rains: కడప జిల్లాల్లో 40కి చేరిన మృతుల సంఖ్య.. మృతదేహాల కోసం గాలింపు చర్యలు..!

India Vs New Zealand 2021: సారథిగా మారి బతికిపోయాడు.. లేకుంటే టీమిండియాలో చోటు కష్టమే: గౌతమ్ గంభీర్