Rajya Sabha Secretariat Recruitment: కేంద్రం కొలువులు.. రాజ్యసభ సెక్రటేరియట్‌లో 110 ఉద్యోగాలు!

|

Mar 24, 2022 | 7:44 PM

రాజ్యసభ సెక్రటేరియట్‌లో పర్సనల్ అసిస్టెంట్, సెక్రటేరియట్‌ అసిస్టెంట్ (Secretariat Assistant Posts), ట్రాన్స్‌లేటర్‌ ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Rajya Sabha Secretariat Recruitment: కేంద్రం కొలువులు.. రాజ్యసభ సెక్రటేరియట్‌లో 110 ఉద్యోగాలు!
Rajya Sabha Secretariat
Follow us on

Rajya Sabha Secretariat Recruitment 2022: రాజ్యసభ సెక్రటేరియట్‌లో పర్సనల్ అసిస్టెంట్, సెక్రటేరియట్‌ అసిస్టెంట్ (Secretariat Assistant Posts), ట్రాన్స్‌లేటర్‌ ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 110

పోస్టుల వివరాలు:

  • లెజిస్లేటివ్/ కమిటీ/ ఎగ్జిక్యూటివ్/ ప్రోటోకాల్ ఆఫీసర్ పోస్టులు: 12
  • అసిస్టెంట్ లెజిస్లేటివ్/ కమిటీ/ ఎగ్జిక్యూటివ్/ ప్రోటోకాల్ ఆఫీసర్ పోస్టులు: 26
  • సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 27
  • అసిస్టెంట్ రీసెర్చ్/ రిఫరెన్స్ ఆఫీసర్ పోస్టులు: 3
  • ట్రన్స్‌లేటర్‌ పోస్టులు: 15
  • పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు: 15
  • ఆఫీస్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు: 12

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: పే స్కేల్ లెవల్ 4 నుంచి 10 ప్రకారం జీతాలు చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత పోస్టును బట్టి నోటిఫికేషన్‌లో సూచించిన అర్హతలుండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Director (Personnel), Room Number – 240, 2nd Floor, Rajya Sabha Secretariat, Parliament of India, Parliament House Annexe, New Delhi-110001

దరఖాస్తులకు తేదీ: మే 3, 2022 (నోటిఫికేషన్‌ (మార్చి 19) విడుదలైన 45 రోజులలోపు).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

DRDO INMAS Recruitment 2022: రూ. 54 వేల జీతంతో.. డీఆర్‌డీఓ – ఇన్‌మాస్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు..