Railway Jobs: రైల్వేలో జూనియర్‌ టెక్నికల్ అసోసియేట్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Railway Jobs: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. జబల్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ జూనియర్‌ టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు...

Railway Jobs: రైల్వేలో జూనియర్‌ టెక్నికల్ అసోసియేట్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Railway Jobs

Updated on: Mar 13, 2022 | 7:24 AM

Railway Jobs: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. జబల్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ జూనియర్‌ టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాసస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ (10), జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ (10) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్‌ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 17-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Walking: ఏ వయసు వారు ఎన్ని అడుగులు వేయాలో తెలుసా? పరిశోధనలో సంచలన విషయాలు..

Varun Sandesh: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Viral Video: మొసలితో అడవి దున్న హోరాహోరీ పోరు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో