నిరుద్యోగులకు సువర్ణవకాశం..! 4 ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనున్న ఇండియన్ రైల్వే.. అర్హులెవరంటే..?

|

Sep 19, 2021 | 1:27 PM

Rail Kaushal Vikas Yojana: దేశంలోని నిరుద్యోగ యువత కోసం భారతీయ రైల్వే ప్రత్యేక శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 50 వేల మందికి 4 విభిన్న ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనుంది.

నిరుద్యోగులకు సువర్ణవకాశం..! 4 ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనున్న ఇండియన్ రైల్వే.. అర్హులెవరంటే..?
Indian Railway
Follow us on

Rail Kaushal Vikas Yojana: దేశంలోని నిరుద్యోగ యువత కోసం భారతీయ రైల్వే ప్రత్యేక శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 50 వేల మందికి 4 విభిన్న ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనుంది. అనంతరం వారు తమ తమ రంగాలలో ఉపాధి పొందవచ్చు. ఈ పథకం పేరు రైల్ కౌశల్ వికాస్ యోజన. ఈ పథకం కింద యువతకు ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తుంది. ఏదైనా పరిశ్రమ లేదా ఫ్యాక్టరీలలో పని చేయడానికి ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి ట్రేడ్‌లు చేసి ఉండాలి. ఈ శిక్షణ ద్వారా వీరు ఉపాధి పొందుతారని వీరి ఉద్దేశ్యం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినమైన సెప్టెంబర్ 17న రైల్వే ఈ పథకాన్ని ప్రారంభించింది.

75 ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమం
రైల్ కౌశల్ వికాస్ యోజన కింద దేశంలోని 75 ప్రదేశాలలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. దేశంలోని యువతకు ఉపాధిని ప్రోత్సహించడానికి ఈ పథకం అమలు చేస్తున్నారు. యువతకు వెల్డర్, ఫిట్టర్, మెషినరీ, ఎలక్ట్రీషియన్ వంటి నాలుగు విభిన్న రంగాలలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఉచితం. యువత ఎలాంటి రుసుము చెల్లించకుండా 4 రకాల ట్రేడ్‌లలో శిక్షణ పొందవచ్చు. శిక్షణ సమయంలో యువతకు అన్ని సౌకర్యాలు అందేలా రైల్వే ఏర్పాట్లు చేస్తుంది. దేశంలోని 50 వేల మంది యువతకు సుమారు 100 గంటల శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత యువతకు సర్టిఫికేట్ అందిస్తారు. ఈ సర్టిఫికెట్ రైల్వే వివిధ శిక్షణా కేంద్రాల నుంచి జారీ చేస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల యువత ఈ శిక్షణలో పాల్గొనవచ్చు. ప్రస్తుతం దేశంలోని 75 కేంద్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రారంభంలో శిక్షణకు అర్హులైన 1000 మంది యువతను ఎంపిక చేస్తారు. మొత్తం మూడేళ్లలో 50 వేల మందికి శిక్షణ పూర్తి చేస్తారు.

పథకం ముఖ్యాంశాలు
1. దరఖాస్తుదారు వయస్సు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి.
2. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
3. రైల్ కౌశల్ వికాస్ యోజన కింద ఎలాంటి రిజర్వేషన్ వర్తించదు
4. శిక్షణ సమయంలో యువత 75% హాజరు కలిగి ఉండటం తప్పనిసరి.
5. శిక్షణ వ్యవధి 100 గంటలు లేదా 3 వారాల పాటు కొనసాగుతుంది.
6. శిక్షణ పూర్తయిన తర్వాత యువత పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇందులో రాత పరీక్షలో కనీసం 55 శాతం, ప్రాక్టికల్‌లో కనీసం 60 శాతం స్కోర్ చేయడం అవసరం.
7. శిక్షణ పూర్తిగా ఉచితం కానీ ట్రైనీ వసతి, ఆహారం, ప్రయాణ ఖర్చులను భరించాల్సి ఉంటుంది.
8. ఈ పథకంలో పాల్గొనడానికి ట్రైనీ ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వయస్సు రుజువు, పదో తరగతి మార్క్ షీట్, ఓటరు ID కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్‌ను అందించాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..

SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..

Sonu Sood: సోనూ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.. ఐటీ అధికారులు ఏం తేల్చారంటే..?

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి