Bank Jobs 2023: బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా? పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

|

May 25, 2023 | 1:40 PM

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..

Bank Jobs 2023: బ్యాంక్‌ జాబ్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా? పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
Punjab National Bank
Follow us on

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌/ సీఏ/ సీఎంఏ/ ఐడీడబ్ల్యూఏ/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 11, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులు రూ.59 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాతప‌రీక్ష, పర్సనల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జులై 2వ తేదీన నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాతప‌రీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 120 నిముషాల్లో ఆన్‌లైన్‌ విధానంలో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది. రీజనింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు..

  • ఆఫీసర్‌-క్రెడిట్ పోస్టులు: 200
  • ఆఫీసర్‌-ఇండస్ట్రీ పోస్టులు: 08
  • ఆఫీసర్‌-సివిల్ ఇంజినీర్ పోస్టులు: 05
  • ఆఫీసర్‌-ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు: 04
  • ఆఫీసర్‌-ఆర్కిటెక్ట్ పోస్టులు: 01
  • ఆఫీసర్-ఎకనామిక్స్ పోస్టులు: 06
  • మేనేజర్-ఎకనామిక్స్ పోస్టులు: 04
  • మేనేజర్-డేటా సైంటిస్ట్ పోస్టులు: 03
  • సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్ పోస్టులు: 02
  • మేనేజర్-సైబర్ సెక్యూరిటీ పోస్టులు: 04
  • సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ పోస్టులు: 03

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.