PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

|

Dec 23, 2021 | 7:18 PM

PNB Recruitment: న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో...

PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Follow us on

PNB Recruitment: న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌(సీఆర్‌ఓ), చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ), చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(సీటీఓ), చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌(సీఐఎస్‌ఓ) వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్, బీఈ/బీటెక్, ఇంజనీరింగ్‌/ఎంసీఏ, మాస్టర్స్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను జనరల్‌ మేనేజర్‌–హెచ్‌ఆర్‌ఎండీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, హ్యూమన్‌ రిసోర్స్‌ డివిజన్, ఫస్ట్‌ ఫ్లోర్, వెస్ట్‌ వింగ్, కార్పొరేట్‌ ఆఫీస్‌ సెక్టార్‌–10, ద్వారకా, న్యూఢిల్లీ–110075 పంపించాల్సి పంపించాలి.

* అభ్యర్థులను స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Bangarraju: జూనియర్ బంగార్రాజుతో స్టెప్పులేస్తున్న నాగలక్ష్మీ.. ఆకట్టుకుంటున్న చై.. కృతి పోస్టర్..

Harish Rao: తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రకంపనలు.. హైకోర్టు ఆదేశాలపై స్పందించిన మంత్రి హరీష్‌ రావు

Tamil Nadu Earthquake: తమిళనాడులో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదు!