భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 183 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. ఐటీ ఆఫీసర్, లా మేనేజర్, సీఏ, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్, ఎకనమిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్‌షిప్ మేనేజర్, సాఫ్ట్‌వేర్‌డెవలపర్.. వంటి తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆయా పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, బీటెక్/బీఈ, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీబీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు చెందిన వారు ఐదేళ్లు, ఓబీసీ కేటగిరీకి చెందిన వారికి మూడేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీగా జులై 7, 2023వ తేదీని నిర్ణయించారు.
ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150, జనరల్ అభ్యర్ధులు రూ.850 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. రాతపరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.36,000 నుంచి రూ.78,230 జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.