PSB Recruitment: పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకులో ఐటీ, రిస్క్‌ మేనేజర్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Nov 20, 2021 | 12:57 PM

PSB Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ అండ్‌ సింద్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకులో ఐటీ, రిస్క్‌ మేనేజర్‌ ఖాళీలను..

PSB Recruitment: పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకులో ఐటీ, రిస్క్‌ మేనేజర్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Psb Recruitment
Follow us on

PSB Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ అండ్‌ సింద్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకులో ఐటీ, రిస్క్‌ మేనేజర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫకేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రిస్క్‌ మేనేజర్లు (03), ఐటీ మేనేజర్లు (37) ఖాళీలు ఉన్నాయి.

* రిస్క్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు మ్యాథమేటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఎకనమిక్స్‌/ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల పని అభువం ఉండాలి.

* ఐటీ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌లో ఉత్తీర్ణత పొందాలి. నాలుగేళ్ల పని అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను ది డిప్యూటీ జనరల్‌ మేనేజర్; పంజాబ్‌ సింద్‌ బ్యాంక్‌, ఫిఫ్త్‌ ఫ్లోర్‌, బ్యాంక్‌ బౌజ్‌, న్యూఢిల్లీ-110008 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 19-11-2021న ప్రారంభం కాగా.. 28-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Shocking twist video: షాకింగ్‌ ట్విస్ట్‌.. తప్పిపోయిన కూతురే కోడలైందా..? వైరల్ అవుతున్న వీడియో..

Nikhil Siddhartha : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు పెంచిన కుర్ర హీరో.. నిఖిల్ దూకుడు మాములుగా లేదుగా..

Nikhil Siddhartha : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు పెంచిన కుర్ర హీరో.. నిఖిల్ దూకుడు మాములుగా లేదుగా..