
భారత ప్రభుత్వ ప్రజా సేవా ప్రసార సంస్థ అయిన ప్రసార్ భారతి నిత్యం వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేస్తూ ఉంటుంది. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఉన్న ప్రసార్ భారతి కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. దీంతో నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 14 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ లేదా ఎంసీఏ లేదా లేదా మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి జులై 7, 2026 తేదీ నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. ఈ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 22, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.
ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే తొలుత విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎంపికైన వారికి రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో పని చేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ. 35,000 నుంచి రూ. 50,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర నగరాల్లో నియమితులైన వారికి నెలకు రూ. 35,000 నుంచి రూ. 42,000 వరకు జీతం చెల్లిస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్ కొరకు ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర షరతులు మరియు నిబంధనలను వెబ్‌సైట్‌లో క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
ప్రసార్ భారతి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.