Prasar Bharati Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఏయే అర్హతలు ఉండాలంటే

|

Sep 10, 2024 | 7:41 AM

న్యూఢిల్లీలోని ప్రసార భారతి.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దూరదర్శన్‌ కేంద్రంలోని దూరదర్శన్‌ వార్తా విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 70 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు..

Prasar Bharati Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఏయే అర్హతలు ఉండాలంటే
Prasar Bharati
Follow us on

న్యూఢిల్లీలోని ప్రసార భారతి.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దూరదర్శన్‌ కేంద్రంలోని దూరదర్శన్‌ వార్తా విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 70 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.పోస్టును బట్టి రేడియో/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌ స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్లపాటు పని అనుభవం ఉండాలి. ఆకాశవాణి, దూరదర్శన్‌లో అప్రెంటిస్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఆగస్టు 29, 2024న విడుదలైంది. ఎంపికైన వారు ఢిల్లీలోని దూరదర్శన్‌ కేంద్రంలోని దూరదర్శన్ వార్తా విభాగంలో పని చేయవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. కాగా ప్రసార భారతిలో ఉద్యోగాలకు యువతలో యమ క్రేజీ ఉంది. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడిన భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌లోని 17 విశ్వవిద్యాలయాలకు వీసీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఉపకులపతి (వీసీ) పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబ‌ర్ 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల వీసీలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వాటన్నిటినీ భర్తీ చేయడానికి ఒకేసారి ప్రకటన వెలువరించారు. ఈ పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఖాళీల వివరాలు, విశ్వవిద్యాలయాల పేర్లు, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.