Telugu University: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష-2023లకు కొత్త తేదీలు ప్రకటన.. పూర్తి వివరాలివే

|

Jul 31, 2023 | 8:57 PM

రాష్ట్ర వ్యాప్తంగా గత వారం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల దాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో తెలంగాణ సర్కార్‌ విద్యా సంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సితో సహా జేఎన్టీయూ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల పరిధిలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తోన్న కౌన్సెలింగ్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. తాజాగా అందుకు సంబంధించిన..

Telugu University: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష-2023లకు కొత్త తేదీలు ప్రకటన.. పూర్తి వివరాలివే
Telugu Universaity
Follow us on

హైదరాబాద్, జులై 31: రాష్ట్ర వ్యాప్తంగా గత వారం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల దాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో తెలంగాణ సర్కార్‌ విద్యా సంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సితో సహా జేఎన్టీయూ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల పరిధిలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తోన్న కౌన్సెలింగ్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. తాజాగా అందుకు సంబంధించిన కొత్త తేదీలను మళ్లీ ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో వాయిదా పడిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు కొత్త తేదీలు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి 6 కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 8, 9 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు జులై 31న ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇటీవల డౌన్‌లోడ్‌ చేసుకున్న పాత హాల్‌టికెట్లతోనే పరీక్షలకు హాజరు కావొచ్చని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకూ ఎవరైనా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోకపోతే అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చని సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు జులై 27, 28 తేదీల్లో జరగాల్సి ఉండగా వర్షాల కారణంగా వాయిదా పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.