PNB SO Admit Card 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..!

|

May 23, 2022 | 9:17 PM

PNB SO Admit Card 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ విడుదల అయింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే

PNB SO Admit Card 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..!
Pnb So Admit Card 2022
Follow us on

PNB SO Admit Card 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ విడుదల అయింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 145 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకి సంబంధించి నోటిఫికేషన్ 20 ఏప్రిల్ 2022న జారీ అయింది. దరఖాస్తు చేసుకోవడానికి 07 మే 2022 వరకు సమయం ఇచ్చారు. ఇప్పుడు ఈ పోస్టులకి సంబంధించి అడ్మిట్ కార్డు విడుదల చేశారు. దీంతో పాటు పరీక్ష తేదీలను కూడా ప్రకటించారు. పరీక్ష 12 జూన్ 2022న నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న రిక్రూట్‌మెంట్ పూర్తి ప్రక్రియని తెలుసుకోవచ్చు.

PNB SO అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా..?

1. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

ఇవి కూడా చదవండి

2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో కెరీర్‌పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు Whats New లింక్‌కి వెళ్లండి.

4. 12.06.2022 తేదీన ఆన్‌లైన్ పరీక్ష కోసం కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.

5. ఇప్పుడు అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

5. తర్వాత అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ఓపెన్‌ అవుతుంది.

6. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఎంపిక ప్రక్రియ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ముందుగా రాత పరీక్షకు హాజరుకావాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేసి అందులో కొంతమందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం తుది జాబితాను సిద్ధం చేస్తారు. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

ప్రిలిమినరీ : ఇది 100 మార్కుల ప్రిలిమినరీ పరీక్ష. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హులు అవుతారు.

మెయిన్స్: ప్రిలిమ్స్ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు రెండో దశ అంటే మెయిన్స్ పరీక్షకు హాజరు అవుతారు.

ఇంటర్వ్యూ: ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను చివరి దశగా ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు. మూడు దశలను అధిగమించిన దరఖాస్తుదారు SO పోస్ట్‌కు ఎంపిక అవుతారు.

మరిన్ని కెరియర్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి