PNB Recruitment: డిగ్రీ అర్హతతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Aug 13, 2022 | 6:12 PM

PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

PNB Recruitment: డిగ్రీ అర్హతతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Follow us on

PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఆఫీసర్‌ (ఫైర్‌ సేఫ్టీ) (23), మేనేజర్‌ (సెక్యూరిటీ) (80) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ నాగ్‌పూర్ నుంచి బీఈ – ఫైర్‌, లేదా AICTE/UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ డిగ్రీ(ఫైర్ టెక్నాలజీ/ఫైర్ ఇంజనీరింగ్)(B.Tech/BE లేదా తత్సమానం) పూర్తి చేసి ఉండాలి.

* సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు AICTE/UGC గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు జులై 1, 2022 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* మొదట అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలను నింపి పోస్ట్‌ ద్వారా చీఫ్‌ మేనేజర్‌ (రిక్రూట్మెంట్‌ సెక్షన్‌), హెచ్‌ఆర్‌డీ డివిజన్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కార్పొరేట్ ఆఫీస్‌, ప్లాట్‌ నెం 4, సెక్టార్‌ 10, ద్వారకా, న్యూఢిల్లీ – 110075 అడ్రస్‌కు పంపించాలి.

* జనరల్‌ అభ్యర్థులు రూ. 1003, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 59 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ఆగస్టు 30, 2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..