Powergrid Jobs: గుడ్‌న్యూస్! నేరుగా ఇంటర్వ్యూతోనే 105 పవర్ గ్రిడ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు ఇవే..

|

Jan 27, 2022 | 8:49 PM

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజినీర్ ట్రయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Powergrid Jobs: గుడ్‌న్యూస్! నేరుగా ఇంటర్వ్యూతోనే 105 పవర్ గ్రిడ్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు ఇవే..
Pgcil
Follow us on

Powergrid Recruitment 2022: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజినీర్ ట్రయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 105

పోస్టులు: అసిస్టెంట్ ఇంజినీర్ ట్రయినీ

ఖాళీల వివరాలు:
కంప్యూటర్ సైన్స్: 37
ఎలక్ట్రికల్: 60
సివిల్: 4
ఎలక్ట్రానిక్స్: 4

ట్రయినింగ్ పిరియడ్‌: ఏడాది

పే స్కేల్: ట్రయినింగ్ పిరియడ్‌లో నెలకు రూ.40,000 జీతంగా చెల్లిస్తారు. ట్రయినింగ్ పూర్తైన తర్వాత రూ.50,000 నుంచి 1,60,000 జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ 2021 కూడా ఉండాలి.

వయో పరిమితి: డిసెంబర్ 31, 2021నాటికి అభ్యర్ధుల వయసు 28 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ. 500 చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CSIR UGC NET June 2021 Exams: సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ జూన్ 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!