PFRDA Recruitment 2022: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

భారత ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ (PFRDA).. 22 ఆఫీసర్‌ గ్రేడ్‌ -ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

PFRDA Recruitment 2022: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Pfrda

Updated on: Sep 16, 2022 | 4:52 PM

PFRDA Officer Grade- A Recruitment 2022: భారత ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ (PFRDA).. 22 ఆఫీసర్‌ గ్రేడ్‌ -ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనరల్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, రీసెర్చ్‌, లీగల్‌, అఫీషియల్‌ ల్యాంగ్వేజ్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి లా డిగ్రీ, స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్‌/కామర్స్‌/బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ఎకనామెట్రిక్స్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ /ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ స్కిల్స్‌ కూడా ఉండాలి. జులై 31, 2022వ తేదీ నాటికి వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.89,150ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష రెండు ఫేజ్‌లలో ఉంటుంది. మొదటి ఫేజ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో 100 మార్కులకు 80 మల్లిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు 60 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రెండో పేపర్‌ 200 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నల ప్రశ్నలకు 80 నిముషాలలో పరీక్ష నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.