Osmania University: విద్యార్థుల సౌకర్యార్థం ఇకపై 27 భాషల్లో ఓయూ వెబ్‌సైట్‌..

వివిధ రాష్ట్రాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది..

Osmania University: విద్యార్థుల సౌకర్యార్థం ఇకపై 27 భాషల్లో ఓయూ వెబ్‌సైట్‌..

Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2021 | 6:44 PM

వివిధ రాష్ట్రాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇంగ్లిష్‌లో మాత్రమే ఉన్న ఓయూ వెబ్‌సైట్‌ను 27 భాషల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమేరకు శుక్రవారం నుంచి 27 భాషల్లో ఓయూ పోర్టళ్లను స్టూడెంట్లi వినియోగించుకోవచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులు వర్సిటీలోని కోర్సులు, అడ్మిషన్లు ఇతర సమాచారాన్ని వారికి కావాల్సిన భాషలో విద్యార్థులు పొందవచ్చని వారు పేర్కొన్నారు.

ఇప్పుడు ఓయూ వెబ్‌సైట్‌ను ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, జర్మన్, నేపాలి, ఫ్రెంచ్, స్పానిష్​, మంగోలియన్, పర్షియన్, చైనీస్, హంగేరియన్, ఇండోనేషియన్ ​తదితర భాషల్లోనూ చూడొచ్చు. ఓయూలో చదివేందుకు వచ్చే దాదాపు 90 దేశాల విదేశీ స్టూడెంట్స్​కోసం ఈ మల్టీ లింగ్వల్ ​సేవలు ఉపయోగపడతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్ ​యాదవ్​, సైట్ డిజైన్ ​టీం డైరెక్టర్ ​నవీన్​కుమార్​ తెలిపారు. భవిష్యత్‌లో ఇక్కడ విద్యను అభ్యసించే వారికి కూడా ఈ సరికొత్త సేవలు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.

Also read:

Railway News: దంచికొడుతున్న వానలు.. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు.. మరిన్ని దారిమళ్లింపు

Hyderabad Rains: రాగల 48 గంటల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

News Watch: బాబు ఏడుపు వెనుక ఏమైందో తెలుసా..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..