BR Ambedkar Open University: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు పీజీ రెండో సంవత్సరం ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎంఏ, ఎంకామ్ తరగతులకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించనున్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అన్ని ఎంఎస్సీ కోర్సులకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించనున్నారు. జూమ్ ద్వారా ఈ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ అడ్మిషన్ నెంబర్‌తో జూమ్ ద్వారా లాగిన్ కావాలని సూచించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా కొన్ని మినహా.. దాదాపు అన్ని విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష విద్యా విధానానికి బదులుగా.. ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కాలేజీలు, స్కూల్స్ ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాయి. తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కూడా ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించారు. ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి మరింత సమాచారం కొరకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు సూచించారు.
Also read:
NEET Application: నీట్ దరఖాస్తు గడువు పెంపు.. అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..