AP RGUKT IIIT Counselling: ఈ నెల 24, 25వ తేదీల్లో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి రెండో విడత కౌన్సెలింగ్‌ 

|

Jul 23, 2023 | 1:31 PM

రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023-29 విద్యా సంవత్సారానికి సంబంధించి..

AP RGUKT IIIT Counselling: ఈ నెల 24, 25వ తేదీల్లో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి రెండో విడత కౌన్సెలింగ్‌ 
AP RGUKT IIIT
Follow us on
AP RGUKT IIIT admissions 2023-24: రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023-29 విద్యా సంవత్సారానికి సంబంధించి ఆరేళ్ల బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ శనివారం ముగిసింది. మొత్తం 1,086 మందికి గాను 904 మంది విద్యార్థులు మొదటి విడతలో ప్రవేశాలు పొందారని, మిగిలిన 182 సీట్లు రెండవ విడతలో పూర్తి చేయనున్నట్లు ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ కె సంధ్యారాణి తెలిపారు.
ఇక ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ రెండో విడత కౌన్సెలింగ్‌ జులై 24, 25వ తేదీల్లో ఇడుపులపాయలోని ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లో జరుగుతుందని ఆమె తెలిపారు. ఆగస్ట్‌ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి మొత్తం 4,400 సీట్లు ఉంగా ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయిస్తే మిగిలిన 4,040 సీట్లకు కౌన్సెలింగ్‌ జరుగుతోంది.
మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.