ONGC Recruitment 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు బంపరాఫర్‌! నెలకు రూ.లక్షన్నర జీతంతో ఆయిల్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు..

|

Sep 21, 2022 | 9:19 AM

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC).. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్..

ONGC Recruitment 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు బంపరాఫర్‌! నెలకు రూ.లక్షన్నర జీతంతో ఆయిల్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు..
ONGC Dehradun Recruitment 2022
Follow us on

ONGC Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ONGC).. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌,పెట్రోలియం ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి అభ్యర్ధుల వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను గేట్ 2023 సాధించిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • AEE (సిమెంటింగ్)- మెకానికల్
  • AEE (సిమెంటింగ్)-పెట్రోలియం
  • AEE (సివిల్)
  • AEE (డ్రిల్లింగ్)-మెకానికల్
  • AEE (డ్రిల్లింగ్)-పెట్రోలియం
  • AEE (ఎలక్ట్రికల్)
  • AEE (ఎలక్ట్రానిక్స్)
  • AEE(ఇన్‌స్ట్రుమెంటేషన్)
  • AEE (మెకానికల్)
  • AEE (ఉత్పత్తి)-మెకానికల్
  • AEE (ప్రొడక్షన్ కెమికల్)
  • AEE (ప్రొడక్షన్‌)-పెట్రోలియం
  • AEE(ఎన్విరాన్‌మెంట్)
  • AEE (రిజర్వాయర్)
  • కెమిస్ట్‌
  • జియాలజిస్టు
  • జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్‌)
  • జియోఫిజిసిస్ట్ (వెల్స్)
  • మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్
  • ప్రోగ్రామింగ్ ఆఫీసర్
  • ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌
  • AEE (ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.