భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్.. 17 స్పెషలిస్ట్ డాక్టర్, చీఫ్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆప్తమాలజీ, అనస్తేషియా, గైనకాలజీ, డెర్మటాలజీ, చెస్ట్ ఫిజిషియన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజీషియన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఫారెన్ గోయింగ్ మాస్టర్స్ సర్టిఫికేట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 8, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.70,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.