Navodaya Vidyalaya JNVST Class 9 results: 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన జవహర్‌లాల్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST) ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి (NVS) మంగళవారం (జూన్ 14) విడుదలచేసింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో ఫలితాలను చెక్ చూసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు జవహర్‌లాల్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ ఏప్రిల్ 9న జరిగింది.
JNVST Class 9 Results 2022 ఎలా చెక్ చేసుకోవాలంటే..
జవహర్ నోవదయలో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఫలితాలు ఇంకా వెలువడలేదంటూ ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో వాస్తవం లేదని, ఫలితాలు వెలువడ్డాయని, అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌చేసుకోవాలని నవోదయ విద్యాలయ సమితి ఈ సందర్భంగా తెలియజేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.