అమరావతి, నవంబర్ 26: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ తాజా ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం కోనసీమ మెడికల్ కాలేజీ (కిమ్స్)లో 25 సీట్లు, కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీలలో 50 ఎంబీబీఎస్ సీట్లకు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయడానికి స్పెషల్ ‘స్ట్రే’ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌లో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. సీటు పొందిన విద్యార్ధులు బుధవారం (నవంబరు 26వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల్లోగా సీట్లు పొందిన ఆయ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు కాలేజీల్లోని 75 ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు, అంతకు ముందు మిగిలిన 5 యాజమాన్య సీట్లకు నవంబరు 25న నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించడం జరిగింది.
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం 4450 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి త్వరలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు తాజాగా విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తమ తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి నమోదు చేసి, అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 30న మెయిన్స్ పరీక్ష జరుగనుంది. ఇప్పటికే అక్టోబర్ 19, 20 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు నవంబరు 30 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.