UGC NET 2022 Results: సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2022 ఫలితాలు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

|

Oct 30, 2022 | 8:15 AM

సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2022 ఫలితాలు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం (అక్టోబర్‌ 29) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో స్కోర్ కార్డును..

UGC NET 2022 Results: సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2022 ఫలితాలు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..
CSIR UGC NET June 2022 results
Follow us on

సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2022 ఫలితాలు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం (అక్టోబర్‌ 29) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో స్కోర్ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో 166 నగరాల్లో 306 కేంద్రాల్లో దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2022 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 1,62,084ల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ అక్టోబర్‌ 1న విడుదలైంది. అక్టోబర్‌ 1, 2, 3 తేదీల్లో ప్రాథమిక కీపై అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఎన్టీఏ తాజాగా ఫలితాలను విడుదల చేసింది.

దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్(జేఆర్‌ఎఫ్), లెక్చరర్‌షిప్(ఎల్‌ఎస్‌)/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత కోసం సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ పరీక్షను ప్రతి యేట ఎన్టీఏ నిర్వహిస్తోంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఓ ప్రకటనను జారీ చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను సీఎస్‌ఐఆర్‌ నెట్‌ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.